![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -38 లో.....మా నాన్న లోన్ తీసుకోలేదని జానూ, నందు బ్యాంకుకి వెళ్తారు. వారితో పాటు సింహాద్రి కూడా వెళ్తాడు. మీ నాన్న లోన్ తీసుకున్నాడని సింహాద్రికి సంబంధించిన బ్యాంకు మేనేజర్ చెప్తాడు. నాకు డౌట్ ఉంది మీరు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకొని రండి అని జానూ అనగానే సింహాద్రి సైగ చేస్తాడు. ఇక వాళ్ళు ఏదో డాక్యుమెంట్స్ తీసుకొని వస్తారు. అందులో సంతకం చూసి జానూ షాక్ అవుతుంది.
ఈ డేట్ రోజు మా నాన్న దుబాయ్ లో ఉన్నాడు కదా లోన్ ఎలా తీసుకున్నాడని జాను అడుగుతుంది. మీరు ఇంకా ఏ కాలంలో ఉన్నారు.. వీడియో ద్వారా KYC చేసి తీసుకున్నారు సాక్షిగా సింహాద్రి గారే ఉన్నారని ఆ ఆఫీసర్ వాళ్ళు అంటారు. ఇక ఆ తర్వాత సింహాద్రి తన నటన మొదలెడతాడు. నా ప్రాణస్నేహితుడిని నేను మోసం చెయ్యనని జానూతో సింహాద్రి అంటాడు. మరొకవైపు జానూ, నందు, సింహాద్రి ఇంటికి వెళ్తారు. మీరు మా ఇంటికి రాలేదు.. నేను అప్పుడే పరాయివాడిని అయ్యానా అని సింహాద్రి యాక్టింగ్ చేస్తాడు. ఇదిగో ఈ డబ్బు ఉంచు అని సింహాద్రి ఇస్తుంటే వద్దు అంకుల్.. మా ఖర్చు మేం చూసుకుంటాం.. మీకు వీలు అయితే ఆ తోట ప్రాబ్లమ్ సాల్వ్ చెయ్యండి అని జానూ అంటుంది. వీలు అయితే ఏంటే ఇప్పటివరకు అన్నయ్యే చూసుకున్నాడు కదా అని శారద అంటుంది. అంకుల్ పెళ్లి వాళ్లతో మాట్లాడండి అని నందు చెప్తుంది. మరొకవైపు అసలు ఆ రామారావు నిజంగానే హాస్పిటల్ లో ఉన్నాడా లేదా కనుక్కోవాలని సూర్య అనుకొని వాళ్ళ అమ్మ వాళ్ళ ఫ్రెండ్ ఒక డాక్టర్ తనతో మాట్లాడతాడు. వాళ్ళ హాస్పిటల్ లో అలాంటి పేషేంట్ ఎవరు లేరని చెప్తారు. దాంతో తుఫాన్ ని తీసుకొని సూర్య అక్కడికి బయల్దేరతాడు.
మరొకవైపు నందుకి ఫోన్ వస్తుంది. మురళి ఆ ఫోన్ తీసుకొని వెళ్లి నందుకి ఇస్తాడు. నువ్వెందుకు తీసుకొని వచ్చావ్.. ఒకవేళ నాకు కాబోయే వాడు నీ వాయిస్ వింటే ఏమని అనుకుంటాడని నందు అంటుంది. తరువాయి భాగంలో నందుని శారద తిడుతుంది దాంతో నందు అలిగితే తనని బుజ్జగించి భోజనం తినిపిస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |